Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక రవాణా అక్రమం.. నకిలీ రసీదులతో సరికొత్త దందా.!

ఇసుక రవాణా అక్రమం.. నకిలీ రసీదులతో సరికొత్త దందా.!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట, తాడిచెర్ల, మల్లారం గ్రామాల్లో మానేరు పరివాహక ప్రాంతాల్లో నిత్యం అక్రమ ఇసుక రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కొన్ని నెలలుగా పోలీస్, రెవెన్యూ, పారెస్టు, మైనింగ్ అధికారుల కనుసైగలో జోరుగా సాగుతున్న విషయం విదితమే. మానేరులో ఇసుక తవ్వకాలు కూలీలకు బదులుగా డోజర్లతో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక వ్యాపారులు తోడేస్తున్నారు. ధనార్జనే ద్యేయంగా రోజుకు వందలాది ఇసుక ట్రాక్టర్లతో రవాణా చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక కోసం తీసిన గోతులు ఓసిపి గోతులను తలపించేలా కనిపిస్తున్న పరిస్థితి.

అయితే ఇటీవల వల్లెంకుంట పాలకవర్గం, ఇసుక ట్రాక్టర్ల యజమానులు జీపీ కార్యాలయం ఆవరణలో రహస్యంగా చర్చించుకుని గ్రామం నుంచి ట్రాక్టర్లు వెళ్తున్నందున ట్రాక్టర్ల యజమానుల వద్ద కొంత మొత్తం వసూలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అయితే దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదని సమాచారం.

నకిలీ బిల్లు పుస్తకాలు ముద్రించి..
వల్లెంకుంట గ్రామాభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు అనే నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించారు.రహదారిపై ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి ట్రాక్టర్ల యజమానుల వద్ద ట్రిప్పునకు రూ.100 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ సరికొత్త దందాలో ప్రైవేటు వ్యక్తులు ఉండటం అనుమానాలకు తావిస్తోంది.డబ్బులు ఎవరు తీసుకున్నారో సంతకాలు కూడా ఉండటం లేవని అంటున్నారు.అక్రమ ఇసుక వ్యాపారులు రోజుకు 30 నుంచి 40 ట్రిప్పుల ఇసుకను ఒక్కొక్క ట్రిప్పుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు కాటారం,గారెపల్లి ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వ, ఇంటి పనులకు ఇసుకను తీసుకు వచ్చే వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.

అధికారులు ఏమన్నారంటే.
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని,జిపిఓను సంప్రదించగా ఇలా వసూలు చేయడం ఎక్కడా లేదని,ఈ విషయం మా దృష్టికి రాగానే ఉన్నతాధికారులకు తెలియజేసినట్లుగా తెలిపారు.అయిన ఇసుకతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అనుమతులు ఇచ్చేస్థాయి తమకు లేదన్నారు.సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికైనా పర్యవేక్షణ చేసి సహజ సంపదను కాపాడి,నకిలీ రసీదుల చిట్టపై చర్యలు తీసుకోవాలని రైతులు,ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -