Sunday, September 20, 2026
E-PAPER
Homeఆటలుఅసౌకర్యాల నడుమ 
ఆసియా క్రీడలు ప్రారంభం

అసౌకర్యాల నడుమ 
ఆసియా క్రీడలు ప్రారంభం

- Advertisement -

నగోయోలో వసతి ఏర్పాట్లకు తీవ్ర కొరత
ఐఓఏ రూ.3కోట్లతో అథ్లెట్లకు బస ఏర్పాటు

నగోయో: 20వ ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయో వేదికగా శనివారం నుంచి ప్రారంభం కాగా.. వసతి ఏర్పాట్లు, ప్రయాణ, భోజన ఏర్పాట్లపై అథ్లెట్లనుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక భారత షాట్‌పు టర్‌ తజిందర్‌పాల్ సింగ్ తూర్‌తో పాటు అథ్లెట్లకు నిర్ణీత సమయానికి అందాల్సిన కిట్ అందకపోవడంతో తజిందర్‌ స్థానంలో కబడ్డీ క్రీడాకారుడు పవన్‌ సెహ్రావత్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ విషయంపై తజిందర్ పాల్ స్పందిస్తూ.. ‘నా అఫీషియల్ కిట్ భారత్‌లోనే ఉంది. అది మధ్యాహ్నం 3 గంటల కు నగోయాకు వస్తుందన్నారు. నగోయా విమానాశ్రయానికి వెళ్లి ఆ కిట్ అందుకొని ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాలకు రాలేనని భారతీయ ఒలింపిక్ సంఘానికి(ఐఓఏ) సమాచారం అందించా.. అలాగే అథ్లెటిక్స్ టీమ్‌లో ఎవరికీ ఇప్పటివరకు కిట్లు అందలేదని’ తెలిపాడు.

వసతి ఏర్పాట్లపైనా తీవ్ర విమర్శలు..
వసతి, భోజన సాధన ఏర్పాట్లపై అథ్లెట్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా నగోయోలో ఉన్న అథ్లెట్లు అక్కడి సౌకర్యాలు, ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో నిద్రపోవడం కష్టంగా ఉందంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల కమిటీ చైర్మన్‌ తయ్యబ్‌ ఇక్రమ్‌ మాట్లాడుతూ.. పెద్ద క్రీడా ఈవెంట్ల నిర్వహణలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, గత కొన్ని రోజులుగా వసతి, ఇతర సౌకర్యాల విషయంలో అథ్లెట్లు తీవ్ర విమర్శలు చేస్తున్న మాట వాస్తవమేనని, కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, దీనిని రాజకీయం చేయడం సరికాదన్నారు. వాటన్నింటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని, అథ్లెట్ల ప్రాక్టీస్‌కు వసతి గదుల వద్ద సాధన కిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 2030, 2034 ఆసియా క్రీడల్లో గేమ్స్‌ విలేజ్‌లు కూడా ఇలానే ఉంటాయని చెప్పడం, ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలా చేశామని ఆయన బహిరంగంగా ప్రకటించడం పలు విమర్శలకు దారితీసింది.

ఐఓఏ సొంత ఖర్చులతో…
నగోయాలో గదుల కొరత తీవ్రంగా ఉండటంతో భారత ఒలింపిక్‌ అసోసి యేషన్‌(ఐఓఏ) దాదాపు రూ.3కోట్ల రూపాయల సొంత ఖర్చులతో ఆఘమేఘాలమీద ఏర్పాట్లు చేసింది. ప్రారంభోత్సవ వేడుకల నాటికి భారత పూర్తి బృందం(503మంది అథ్లెట్లు) నగోయాకు చేరుకోనున్న క్రమంలో ఐఓఏ ఈ ఏర్పాట్లు చేసింది. అలాగే అథ్లెట్లు తీసుకొనే ఆహారం(డైట్‌) విషయంలోనూ కొరత ఉంది. అథ్లెట్లకు నిర్దిష్టమైన క్యాలరీల అవసరం ఉంటుంది కాబట్టి అందులో ఏమైనా సమస్య ఉంటే అది నిర్వాహకులపై చెడు ప్రభావం చూపుతుందని, అవసరమైన మెనూల రకాలపై సంప్రదించిన తర్వాతే క్యాటరింగ్‌కు ఆర్డర్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక 2038 ఆసియా క్రీడలకు ఆతిథ్య హక్కుల రేసులో ముందంజలో ఐఓఏకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి.టి. ఉష, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియా క్రీడల ప్రారంభోత్సవం నాటికి త్రివర్ణ పతకం, అథ్లెట్ల కిట్స్‌ సరైన సమయానికి అందరకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.

మను బకర్‌ భావోద్వేగం…
ప్రారంభోత్సవ వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని మోసిన ఒలింపిక్ పతక విజేత మను బకర్ భావోద్వేగానికి గురైంది. తనకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున తన దివంగత కోచ్ జస్పాల్ రాణా లేకపోవడం తనను కలచివేసిందని ఆమె పేర్కొంది. “ఈ రోజు జస్పాల్ సార్‌ను చాలా మిస్ అయ్యాను. నా పక్కన ఆయన లేకపోవడం నిజంగా ఒక భావోద్వేగభరితమైన రోజుగా అనిపించింది,” అని ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ఆమె తెలిపింది. మాజీ ఒలింపిక్‌ ఛాంపియన్ షూటర్, కోచ్‌ జస్పాల్‌ రాణా, జూన్ 11న 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భాకర్ కెరీర్‌లో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించడమే కాకుండా, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించేలా మార్గనిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -