- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని చాత గ్రామంలో ఏడు రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలందుకున్న గణనాథుడులు ఆదివారం నిమజ్జనానికి ముస్తాబయ్యారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి విగ్రహాలను గ్రామంలో ప్రధాన వీధుల గుండా పలు సంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో ఊరేగింపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుబేర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జాజుల దేవేందర్, గ్రామస్తులు, మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



