ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు చెన్నయ్య
నవతెలంగాణ-మిడ్జిల్
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా శ్రమించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు చెన్నయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని మున్ననూర్ గ్రామంలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామాల్లోని ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ఎస్సీ సెల్ నాయకులు చొరవ చూపాలని సూచించారు.
ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రామ కమిటీ ఎన్నిక
మున్ననూర్ గ్రామ ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా బచ్చలకూర వెంకటయ్య, వైస్ చైర్మన్ మల్లిగారి అరుణ రాజు, ప్రధాన కార్యదర్శిగా వాడియాల బాలరాజ్ ,సహాయ కార్యదర్శిగా జోగు అంజయ్య ,కోశాధికారీ గా జోగు చెన్నయ్య కమిటీలను ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి, దళితుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేయాలని చెన్నయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, బండారి వెంకటయ్య ,నరసింహులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



