Sunday, September 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్‌ లోనే మకాం వేసిన ఎస్పీ

ముధోల్‌ లోనే మకాం వేసిన ఎస్పీ

- Advertisement -

నిమజ్జన బందోబస్తులో నిమగ్నం
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో ఆదివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ముధోల్ లోనే మకాం వేసి, బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం నుండి పోలీసులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బందోబస్తులో చేపట్టాల్సిన చర్యలను ఎస్పీ వివరించారు. గత సంవత్సరం మాదిరిగా ప్రశాంతంగా నిమజ్జనం సకాలంలో పూర్తయ్యేలా ఎస్పి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ గణేష్ మండలిలను సందర్శించారు. మొదట బ్రాహ్మణ గల్లో ఉన్న గణేష్ మండపంలో ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బందోబస్తు ఏర్పాట్లతో పాటు ,ఆయా కూడల్లిలో పికెటింగ్ లను పరిశీలించారు. మజీద్ చౌక్ లో మకాం వేసి శోభాయాత్ర బందోబస్తును ఎస్పీ పర్యవేక్షించారు. సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురియడంతో శోభాయాత్ర కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ ఎస్పీ గణేష్ నిమజ్జనం ను ప్రశాంతంగా సకాలంలో పూర్తి కావటానికి ఎప్పటికప్పుడు పోలిసులకు సూచనలిస్తూ..తగు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -