Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జగ్గారెడ్డిని కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు

జగ్గారెడ్డిని కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్ రామ్ మందిర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని జగ్గారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నిర్మలా జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఏడు సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం పనిచేశారని తెలిపారు. ఆమె హయాంలో జిల్లా కేంద్రంలో ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించామో, అంతకంటే ఎక్కువగా చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని జగ్గారెడ్డి సూచించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు: చంద్రశేఖర్ రెడ్డి
నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.నిర్మలా జగ్గారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ఆమె మాదిరిగానే అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అధిష్టానానికి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -