Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

మద్నూర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయ ఆవరణలో సోమవారం తెలంగాణ ఉద్యమ కారులు ఆచార్య లక్ష్మణ్ బాపూజీ 14 వర్ధంతి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా నాయకులు రచ్చ కుశాల్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం జీవితాంతం పోరాడిన త్యాగధనులు,  తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత స్వతంత్ర సమరయోధుడు, ప్రజానాయకుడు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం, సేవలు, గుర్తు చేశారు.

చేనేత కార్మికులు, వెనుక బడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు. 21 సెప్టెంబర్ 2012లో ఆయన తొలిశ్వాస విడిచారని చెప్పారు. ఆయన ఆశయాలే ఐసిఎస్ఈ మార్గదర్శకాలని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా కార్యవర్గ సభ్యులు మద్నూర్ గ్రామ అధ్యక్షులు రచ్చ పెంటేష్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు అందె సందీప్, రచ్చ కుశాల్ కుమార్, కోశాధికారి, శ్రీనివాస్ ఉత్తూర్ వార్, శేషికాంత్, రచ్చ నాగేష్, అంబటి సంతూష్ దత్తురామ్, నరహరి, మణికంఠ  పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -