Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమలగిరి మోడల్ స్కూల్‌లో ఘనంగా 'మాక్ పోలింగ్ 

తిరుమలగిరి మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మాక్ పోలింగ్ 

- Advertisement -

నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండల పరిధిలోని అనంతరాం మోడల్ స్కూల్‌లో మంగళవారం మాక్ పోలింగ్ ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవుల కోసం ఈ ఎన్నికలను ఏర్పాటు చేశారు.​ ఈ ఓటింగ్ ప్రక్రియలో పాఠశాలకు చెందిన 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండియర్ వరకు దాదాపు 600 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

​ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన:
ఎన్నికల ప్రక్రియను ప్రతిబింబించేలా పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితా, ఓటింగ్ మార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లను వనిత పీజీటీ సివిక్స్, యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ చాంద్ ఎన్నికలు ప్రక్రియను పక్కాగా నిర్వహించారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్యం, హక్కులు, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సంజయ్ కుమార్ తెలిపారు.

​విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో వరుసలైన్లలో నిలబడి ప్రజాస్వామ్య యుతంగా తమ నాయకులను ఎన్నుకోవడానికి ఓట్లు వేశారు. ఈ మాక్ ఎన్నికలు విద్యార్థులలో నాయకత్వ పటిమను,బాధ్యతారాహిత్యాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పాఠశాల సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ క్రాంతి కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్కే చాంద్, అధ్యాపకులు సురేష్, మోహన్, జమీల బేగం, ఇందిర, సంగీత, స్వాతి,రాజు, ప్రభాకర్, శ్రీనివాస్,యాకయ్య, ఉపాధ్యాయులు జగన్ నాయక్, భరత్, లక్ష్మయ్య, యాకుబ్ పాషా, నుశ్రత్ సుల్తానా బేగం, వెంకటయ్య, జోసెఫ్, వీరమల్లు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -