Monday, September 21, 2026
E-PAPER
Homeఖమ్మంగణేష్ నవరాత్రి ఉత్సవాల మండపాలను దర్శించిన 'సండ్ర'

గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపాలను దర్శించిన ‘సండ్ర’

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి ​పట్టణంలోని శ్రీనివాస థియేటర్ రోడ్, బైపాస్ రోడ్, తుమ్మూరు రామారావు వీధి, జూపల్లి కంటి ఆసుపత్రి రోడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం దర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ​అనంతరం అంబేద్కర్ నగర్‌, ముత్యాలమ్మ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను సండ్ర  ప్రారంభించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. ​

ఈ సందర్భంగా సండ్ర  మాట్లాడుతూ… వినాయకుని దివ్య ఆశీస్సులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు ​ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ అమరవరపు విజయనిర్మల, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -