Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం.. ఇలా మూడు దశల ఉద్యమాల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని, పద్మశాలి సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు చింతకింది మురళి, హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ చింతకింది రంగ, సెక్రటరీ గాడిపెళ్లి రమేష్, చింతకింది సత్యనారాయణ, రచ్చ హనుమంతు, రేగోటి వెంకటేష్, గొట్టిపాముల నరసింహులు, చింతకింది సిద్ధులు, బిర్రు వెంకటేష్, బేతి సత్యం, చిట్టిమిల్ల కృష్ణ, బేతి వెంకటేష్, చంద్రశేఖర్, భేతి రవి, చింతకింది గిరిప్రసాద్, ఆంజనేయులు, నాగరాజు, గుజ్జ మనోహర్, బింగి శీను, గుజ్జ పాండు, బిర్రు నాగులు తదితర చేనేత కళాకారులు, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -