నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, మహదేవ్పూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నియామక ప్రక్రియలో భాగంగా అధికారులు సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ఈ మేరకు మొత్తం 180 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా..117 మంది అభ్యర్థులు హాజరై తమ ధృవపత్రాల పరిశీలన చేయించుకున్నారని సిడిపిఓ రాధిక తెలిపారు.
ఈ సందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కానీ మిగిలిన అభ్యర్థులు ఈ నెల 24న హాజరై తమ ధృవపత్రాల పరిశీలన చేయించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా తాడిచర్ల-1,2,4,7,అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అభ్యర్థులు మంగళవారం హాజరై క్రింది పత్రాలతో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, సంబంధిత ధృవపత్రాల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలుపాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అవసరమైన ఇతర సంబంధిత పత్రాలను అభ్యర్థులందరూ నిర్ణీత తేదీన తప్పనిసరిగా హాజరై సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.



