- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడి గాయాలపాలై చికిత్స పొందుతూ మహిళ సోమవారం మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని కేఎల్రావునగర్ ఐదో వీధికి చెందిన మద్ది సుజాత(46) తన చిన్న కుమారుడి వద్ద ఉంటున్నారు. ఈనెల 20న ఇంటి సమీపంలోని వినాయక విగ్రహ నిమజ్జనం నేపథ్యంలో అన్నదానం నిమిత్తం బంధువులతో కలిసి వంటలు చేస్తున్నారు. పొయ్యిపై ఉన్న సాంబారు పాత్రను దింపుతుండగా తూలి అందులో పడ్డారు. ముఖం, ఛాతీ, శరీరమంతా కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుజాత మృతిచెందారు.
- Advertisement -



