- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని దన్నూర్ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ అన్నారు. మంగళవారం దన్నూరు గ్రామంలో పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యులు వినీత్ కుమార్ పశువుల దారులకు అవగాహన కల్పించారు. పశుపోషణ పాలు ఉత్పత్తి, ఏద లక్షణాల గురించి వివరంగా చెప్పారు. గ్రామంలో 47 పశువులకు గర్భకోశ చికిత్సలు, 29 సాధారణ చికిత్సలు, 31 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో హనుమంత్, గోపాల మిత్ర సూపర్వైజర్ బసవరాజ్, గోపాల మిత్రులు నాగనాథ్, పరమేష్, మైత్రి చంద్రశేఖర్, పశువుల దారులు పాల్గొన్నారు.
- Advertisement -



