హీరో నాని నటించిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని అందరూ సుబ్బు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అవన్నీ మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. జడల్ జర్నీలో లవ్ పార్ట్నర్గా కనిపిస్తాను. అలాగే నాకంటూ ఒక జర్నీ ఉంటుంది. అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాది చాలా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర. అలాగే కథలో చాలా కీలకమైన పాత్ర. నాని, శ్రీకాంత్, అనిరుద్ తో కలిసి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కావడం గొప్ప ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ శ్రీకాంత్ చాలా డిఫరెంట్ డైరెక్టర్. ఆయనలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకు గొప్ప విజన్ ఉంది. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్ సినిమాలు, స్పోర్ట్స్ సినిమాలు చేయాలని ఉంది. అలాగే బయోపిక్ కూడా అవకాశం వస్తే చేయాలని ఉంది. నిర్మాత సుధాకర్ చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ‘ప్యారడైజ్’ బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. స్టోరీ, యాక్షన్, మ్యూజిక్.. అంతా ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. అడ్రినలిన్ రష్ ఇస్తుంది. సూర్యతో ఒక సినిమా, అలాగే మారి సెల్వరాజ్ తో ఒక సినిమా చేస్తున్నాను.
సుబ్బు పాత్రలో సర్ప్రైజ్ చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



