Wednesday, September 23, 2026
E-PAPER
Homeక్రైమ్‘ఓయో’లో యువతి అనుమానాస్పద మృతి

‘ఓయో’లో యువతి అనుమానాస్పద మృతి

- Advertisement -

పరారీలో స్నేహితుడు
నవతెలంగాణ–మాదాపూర్‌

​హైదరాబాద్‌ మాదాపూర్‌ సిద్దిక్‌ నగర్‌లోని ఓయో హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నానికి చెందిన ప్రయివేటు ఉద్యోగిని షారోన్‌ నిఖితా టోప్నో(29) తన స్నేహితుడు శ్రీనివాస రవితేజతో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాదాపూర్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓఎస్ఎల్‌ఎన్‌ టెర్మినస్‌లో ఉన్న ఓయో హోటల్‌ గది నంబర్‌ 304లో అద్దెకు దిగారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో నిఖితా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని రవితేజ హోటల్‌ సిబ్బందికి చెప్పాడు. వారి సహాయంతో రవితేజ ఆమెను కాకతీయ ఆస్పత్రికి, అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించాడు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ముఖంపై స్వల్ప గాయాల గుర్తులు కనిపించడంతో పాటు హోటల్‌ గది గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఘటనాస్థలాన్ని పరిశీలించి రక్తపు నమూనాలను సేకరించారు. ఘటన అనంతరం రవితేజ ఆస్పత్రి నుంచి అదృశ్యమవడం, అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో పోలీసులు అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ సీసీ కెమెరా దృశ్యాలు, రిజిస్టర్‌, సిబ్బంది వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -