- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తన సినిమా ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రముఖ కథానాయకుడు నాని ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానికి అభినందనలు తెలుపుతూ, స్థానిక పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనిపై అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని సీఎం పేర్కొన్నారు.
- Advertisement -



