నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని కూచూరు గ్రామానికి చెందిన దివంగత ఆర్మీ జవాన్ బసిరెడ్డి యాదగిరికి ఇండియన్ ఆర్మీ లో అత్యున్నత ధైర్యం, త్యాగం బలిధాన్ పరమ ధర్మ (త్యాగం సర్వోన్నత దైవం) అనే నినాదాన్ని సూచించే బాలిదాన్ (త్యాగం) బ్యాడ్జ్ భారత సైన్యం యొక్క పారా (పారా స్పెషల్ ఫోర్సెస్) యూనిట్ల ఉన్నత కార్యాచరణ చిహ్నంగా ఇచ్చే బలిదాన్ అవార్డు వరించింది.
అవార్డు ప్రధాన ఉత్సవంలో భాగంగా బుధవారం పాలమూరు ఎంవీఎస్ డిగ్రీ కళాశాల సమీపంలోని శ్రీరామ్నగర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో యాదగిరి భార్య అయిన లలితకు కర్ణాటకలోని చిత్రదుర్గం ఆర్మీ సెంటర్ కు చెందిన అధికారులు సుబేదార్ సుశీల్ కుమార్ తివారి విజయ్ కుమార్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ బోర్డ్అధికారులు అయిన శ్రీనివాస్ రెడ్డి విజయ్ కుమార్ వేణుగోపాల్ రెడ్డి గ్రామస్తులు ,సహాధ్యాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని యాదగిరికి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.



