Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం

ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూర్‌ గ్రామంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని సర్పంచ్ అశోక్ పటేల్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డోంగ్లి పీహెచ్సీ ఆయుర్వేద వైద్యురాలు ప్రసన్న, మద్నూర్ ఆయుర్వేద వైద్యురాలు ఉమాదేవి పాల్గొని రోగులకు చికిత్సలు అందించి, ఆయుర్వేద మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయుర్వేద మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెప్పారు. ప్రజలు ఇంగ్లీష్‌ మందులకు బదులుగా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపాలని కోరారు. వైద్య శిబిరానికి విశేషంగా జనాలు రావడం పట్ల సర్పంచ్ కృషిని వైద్యులు అభినందించారు. కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ మల్కయ్య, పలువురు పంచాయతీ సభ్యులు, ఆయుష్ అటెండర్ అనిత, పలువురు గ్రామస్తులు, స్తానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -