Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్నిక

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ గా మంతెన మహేష్, కోకన్వీనర్ గా చంద్రగిరి ఎల్లారి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన వీరిని నియమిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగాల రామయ్య, జిల్లా కోఆర్డినేటర్ పొట్ల పోచయ్య నియామక పత్రం అందజేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సూచనల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లుగా తెలిపారు. దళితులు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతికంగా రాజకీయంగా చైతన్యవంతుల కావాలన్నా సదుద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుందన్నారు. దళిత బహుజన అనగారిన వర్గాల హక్కుల సాధనలో ఎల్లవేళలా వారికి అండగా ఉంటామని వెల్లడించారు.అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాల్లో నూతల కమిటీల నిర్మాణం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -