Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్‌ కార్యాలయంలో పోషణ మాసం

మున్సిపల్‌ కార్యాలయంలో పోషణ మాసం

- Advertisement -

నవతెలంగాణ-భీంగల్
మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసీడీఎస్‌ సిబ్బంది బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలలో అందిస్తున్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

అంగనవాడి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ ప్రతీరోజూ మనం తీసుకునే ఆహరంలో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సీజన్లలో దొరికే పండ్లను తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమానికి స్బెర్ సూపర్వైజర్ శారద, కౌన్సిలర్లు నీలం రవి, బొదరె నర్సమని, సెప్టెర్ టీచర్లు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -