Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపిడుగుపాటుకు 8 జీవాలు మృత్యువాత

పిడుగుపాటుకు 8 జీవాలు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ-ధన్వాడ
మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పిడుగులు పడ్డాయి. ఈ ధాటికి 7 మేకలు, ఒక గొర్రె పోతు మృత్యువాత చెందాయి. వివరాల్లోకి వెళితే ..కిష్టాపూర్‌కు చెందిన రేగిచెట్టు తిరుపతి, తండ్రి బలప్ప, మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం అప్పు చేసి సుమారు 40 మేకలను కొనుగోలు చేశాడు. రోజువారీగా మేకలను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం రావడంతో పిడుగు పడింది. ఈ ఘటనలో 7 మేకలు, ఒక గొర్రె పోతు అక్కడికక్కడే మృత్యువాత చెందినట్లు బాధితుడు తెలిపాడు.

పిడుగుపాటుతో సుమారు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి కొనుగోలు చేసిన పశువుల్లో కొన్నింటిని కోల్పోవడంతో తన కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగిందని ఆవేదన చెందాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -