Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూ.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం

రూ.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
బస్వాపూర్ రిజర్వార్ లో ముంపుకు గురవుతున్న బిఏన్ తిమ్మాపురం ఆర్ అండర్ కాలనీలో సుమారు రూ.45 కోట్లతో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, సిసిరోడ్లకు, పాఠశాల భవనాలను శంకుస్థాపన చేశారు. సర్పంచ్ ఎడ్ల వెంకట్ రేడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా రూ.45 కోట్ల వ్యయంతో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.206 కోట్ల నిధులను విడుదల చేశారని తెలిపారు.  ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, స్కూల్స్ తదితర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

సర్పంచ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో ఈ గ్రామాన్ని జిల్లాలోని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇప్పటివరకు 580 ఇండ్ల పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పిఎసిఎస్   చైర్మన్ పక్కిరి కొండల్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి, భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్ తుమ్మెటి పాండు, ఎస్సీ-ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రావుల నందు, ఉప సర్పంచ్ శ్రీశైలం,మాజీ సర్పంచ్ రాజు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్, ఎడ్ల సతిరెడ్డి, కనుకుంట్ల బాబురావు,కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు,అధికారులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -