Thursday, September 24, 2026
E-PAPER
Homeక్రైమ్నిమజ్జన ఊరేగింపులో దళిత యువకుడిపై దాడి

నిమజ్జన ఊరేగింపులో దళిత యువకుడిపై దాడి

- Advertisement -

కత్తితో గొంతుకోసిన వైనం
మాడుగులపల్లి మండలం కుక్కడంలో ఘటన
బాధితున్ని పరామర్శించిన కేవీపీఎస్‌ ‌నాయకులు
నవతెలంగాణ-మాడుగులపల్లి/నల్లగొండ

​వినాయకుని నిమజ్జన ఊరేగింపులో తలెత్తిన వివాదంతో దళిత యువకునిపై కొందరు గ్రామస్తులు దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామంలో దళితులు మంగళవారం రాత్రి వినాయకుని నిమజ్జనం ఊరేగింపుగా గౌడ్స్‌ ‌కాలనీలోకి వెళ్లారు. అయితే, తమ కాలనీలో ఎందుకు నిర్వహిస్తున్నారని కొందరు ప్రశ్నించడంతో గొడవ జరిగింది. దళిత యువకుడు పోతేపాక సాయి కుమార్‌‌ను అదే గ్రామానికి చెందిన తండు వరుణ్, తండు వేణు, తండు వెంకన్న కులం పేరుతో దూషిస్తూ కత్తితో దాడిచేసి గొంతు కోశారు. స్థానికులు పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయికుమార్‌‌ను వెంటనే నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేశ్‌‌యాదవ్‌ ‌తెలిపారు.

​నిందితులను అరెస్టు చేయాలి ​బాధితుడికి మెరుగైన వైద్యం, కుటుంబానికి రక్షణ కల్పించాలి
కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి​ పాలడుగు నాగార్జున

వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దళిత యువకుడు పోతేపాక సాయికుమార్‌పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభు‌త్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి కుమార్‌ను బుధవారం గాదె నరసింహతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. తండు వరుణ్, పండు వేణు, తండు వెంకన్న, తండు లింగయ్యతో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి సాయికుమార్‌‌పై దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ కత్తితో ఎడమ పక్క భాగంలో పొడిచి, గొంతు కోశారని తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. నిందితులను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, బాధితుడి వాంగ్మూలం, సాక్ష్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పూర్తిగా పరిశీలించి కేసు దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. కుక్కడంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
బాధితునికి మెరుగైన వైద్యం, కుటుంబానికి రక్షణ కల్పించాలి : కేవీపీఎస్

వినాయక ఊరేగింపులో దళిత యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితునికి మెరుగైన వైద్యం, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దళిత యువకుడు పోతేపాక సాయి కుమార్‌పై ఆ గ్రామ పెత్తందారులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -