Homeఅంతర్జాతీయంఅమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలికిన ట్రంప్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలికిన ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. నిన్న‌ వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో దిగిన జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి అరుదైన స్వాగతం పలికారు. ఈ పర్యటన ప్రారంభమవుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పదేళ్ల తర్వాత యూఎస్ రాజధాని వాషింగ్టన్‌లో ఆయన అధికారిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి విమానం దిగగా, ట్రంప్ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడంతో పాటు మిలటరీ బ్యాండ్ ప్రదర్శన, విమానాల ఫ్లైఓవర్ కూడా నిర్వహించారు. ఒక దేశాధినేతకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదైన విషయంగా దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -