Homeతాజా వార్తలువినూత్న కథతో 'మత్స్య'

వినూత్న కథతో ‘మత్స్య’

- Advertisement -

హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం ‘మత్స్య’. ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అమ్మా కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..! అంటూ బాబు అమ్మను అడగగా, ఒక ఫిష్ కథ చెప్పనా అంటూ అమ్మ చెప్పే డైలాగ్ తో “మత్స్య” గ్లింప్స్ మొదలవుతుంది. ఎన్నో వింతలు, అద్భుతాలు, ఒక ట్రావెలర్ ఉండే ఆ కథను అమ్మ చెబుతుంటే హీరో క్యారెక్టర్ ను కలర్ ఫుల్ గా పరిచయం చేశారు. గ్లింప్స్ లో వివస్వాన్ స్టైలిష్ లుక్, అప్పీయరెన్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటున్నారు. గ్లింప్స్ చివరలో హీరో ఉన్న బోట్ కింద నుంచి మిథికల్ ఫిష్ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించ బోతున్నట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. ‘ఇప్పటివరకు ఈ తరహాలో సినిమాలు వచ్చినా వాటికి భిన్నంగా ఉంటూ ప్రేక్ష‍కులను ఆసాంతం అలరిస్తుంది. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్ల, ఎడిటర్ – పి.ఎస్.రెడ్డి, డీవోపీ – సురేష్ సారంగం, మ్యూజిక్ – ఉజ్వల్ గుప్తా, డైలాగ్స్ – జే కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజీవనేత్ర.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -