Homeఅంతర్జాతీయంకార్మికుడి మృతితో...ఇటలీలో పురాతన థియేటర్‌ మూసివేత

కార్మికుడి మృతితో…ఇటలీలో పురాతన థియేటర్‌ మూసివేత

- Advertisement -

రోమ్‌ : ప్రమాదంలో కార్మికుడు మరణించడంతో ఇటలీలోని పురాతన థియేటర్‌ను మూసివేశారు. మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించడంతో సంతాప సూచకంగా థియేటర్‌ను రెండు రోజుల పాటు మూసివేయాలని సాంస్కృతిక శాఖ మంత్రి అలెశ్సాండ్రో గియులీ ఆదేశించారు. పురాతన రోమన్‌ అరేనా లోపల కొత్తగా విద్యుదీకరణ జరుగుతుండగా టెక్నీషియన్‌ ఆండ్రియో మోరెట్టి (22) కొన్ని మీటర్ల ఎత్తు నుంచి కింద పడి చనిపోయాడు. ఈ థియేటర్‌ను రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది రోమన్‌ సామ్రాజ్యంలోనే అతి పెద్ద యాంఫీథియేటర్‌. గ్లాడియేటర్‌ పోరాటాలు, మరణశిక్షలు, జంతువుల వేట చిత్రీకరణ కోసం దీనిని ఉపయోగించే వారు. ఇది ఇటలీలో ప్రజలు అత్యధికంగా సందర్శించే ప్రదేశం. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ థియేటర్‌లో అన్ని నిర్మాణ, నిర్వహణ పనులను నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. థియేటర్‌ను పాక్షికంగా మూసివేయాలని తొలుత నిర్ణయించినా దేశంలో అతి పెద్ద కార్మిక సంఘమైన సీజీఐఎల్‌ దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -