తాడిచెర్ల జూనియర్ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం..

నవతెలంగాణ- మల్హర్ రావు
 జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం భూపాలపల్లి జిల్లా ఇంటర్విద్యాధికారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజు ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్  ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యాపకులు, కళాశాల సిబ్బంది విద్యార్థులతో కళాశాల సేప్ నోడల్ అధికారి ఎం నరేందర్ ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం అధ్యాపకులు మాట్లాడారు ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం,  బ్రహ్మాస్త్రం లాంటిదన్నారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రవీణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవీందర్, అధ్యాపకులు  వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, నరేష్, రమేష్, భరత్ రెడ్డి, రవి,  జైపాల్, ఉమామహేశ్వరి కళాశాల సిబ్బంది రవి, షబ్బీర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love