– బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హల్ భోజన శాలను స్థానిక సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ మూజీ బూర్ రహేమాన్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన ఐదేండ్లలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నవతెలంగాణ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస మూర్తి, ఉప్ప సర్పంచ్ అజిజ్, వార్డు సభ్యులు యాదయ్య, శ్రీను, పెంటయ్య గౌడ్, విజరు కుమార్, శ్రీరామ్, జంగయ్య, గిరి, కో ఆప్షన్ బుచ్చయ్య, సీసీ లక్ష్మయ్య, నాయకులు మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య, మోహన్ లాల్, ప్రకాష్‌గౌడ్, శ్రీకాంత్‌యాదవ్, రాఘవేందర్ గౌడ్, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, సంపత్, శ్రీశైలం, ప్రహ్లదగౌడ్, రాధాకృష్ణ, రాజేందర్‌రెడ్డి, గౌస్, కృష్ణ, మహిళ సంఘం అధ్యక్షురాలు శోభ, జుబేధా బేగం, కల్పన, మంగమ్మ, చంద్రకళ మహిళలు తదితరులు పాల్గొన్నారు.