75 మీటర్ల జెండాతో కవాతు

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రెసోనెన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుక లను దుండిగల్‌ క్యాంపస్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ థీమ్‌తో విద్యార్థినులు భారతదేశ మ్యాప్‌ ఆకారంలో మానవహారంగా ఏర్పడ్డారు. ఇది అతిపెద్ద మానవహారం. 75 మీటర్ల పొడవు గల భారతదేశ జెండాతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో విద్యార్థులతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయం వ్యవస్థాపకులు, మోటివేషనల్‌ స్పీకర్‌ శ్రీమతి భారతీయం సత్యవాణి, రెసోనెన్స్‌ హైదరాబాద్‌ సెంటర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. భారతీయం సత్యవాణి మాట్లాడుతూ 75 మీటర్ల భారత జెండాతో కవాతు చేస్తూ వినూత్న రీతిలో గణతంత్ర దినోత్సవాన్ని జరిపిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెసో నెన్స్‌ హైదరాబాద్‌ సెంటర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం 2024 థీములు,’వికాస్‌ భారత్‌ ‘భారత్‌ -లోక్‌ తంత్రకి మాతృక’ ఈ గణతంత్ర దినోత్సవ పెరేడ్‌ లో మహిళా కేంద్రీకత – త్రి – సేవలను చేర్చడం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో ఉపాధ్యా యులు, 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love