నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ, బాపు నగర్ కాలనీలలో 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నాగార్జున స్కూల్‌లో….
నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్ శారదా విద్యా నికేతన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిజాముద్దీన్, స్కూల్ కరస్పాండెంట్ పూర్ణిమ భరత్, ప్రిన్సిపాల్ నీరజలు హాజరై వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు. చిన్నప్పటి నుండే రాజ్యాంగంపై అవగాహనా కలిగి ఉండాలని సూచించారు.
మియాపూర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో…
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ ఇలియాజ్ షరీఫ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు పి.శ్రావణ్‌కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అసిఫ్ పటేల్, సేవా దళ్ అధ్యక్షుడు వేదరాజు శేఖర్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సమీర్ షరీఫ్, వీరందర్‌గౌడ్, మహ్మద్ తౌసీఫ్ అలీ, రాముగౌడ్, .శ్రీనివాస్, ఎం.విజరు, ప్రభాకర్, విజరు, నర్సింహ, షఫీ, ఇర్ఫాన్, అబ్రార్ షరీఫ్, అద్నాన్ షరీఫ్, నవాజ్, రియాజ్, జమీర్, తదితరులు పాల్గొన్నారు.