– ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-సుబేదారి
తెలంగాణ రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న టీఎన్జీఓస్ యూనియన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు వారి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలక్టరేట్ ఎ దుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరస న కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి బీజేపీకి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ టి ఎన్జీవోస్ భవన్లో జరిగినసమావేశంలో యూని య న్ అధ్యక్షులు ఆకుల రా జేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉ ద్యోగుల ఇండ్లస్థలాల కొర కు కడిపికొండలో టీఎన్జీ ఓస్ హౌసింగ్ సొసైటీకి 366/2 సర్వే నంబర్లో కేటాయించిన 32ఎకరాల ప్రభుత్వ భూమి ఉద్యోగుల కు దక్కకుండా చేయుట కొరకు ఆ భూమితో ఎలాం టి సంబంధం లేని వ్యక్తులతో కలిసి బీజేపీ నాయకు లు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఎంతవరకు స మంజసం అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అవ గాహన రాహిత్యంతో మాట్లాడుతూ వారి రాజకీయ అవసరాల కొరకు దళితులను రెచ్చగొడుతున్నారన్నా రు. మేము ఎవరి భూముల ను లాక్కోవడం లేదు. ప్రభుత్వం మాకు కేటాయించిన భూమిని కాపాడు కునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
మాకు ప్రభుత్వం కేటాయించిన భూమిని రా కుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు. మా ఉద్యోగులపై భౌతిక దాడులకు ప్రేరే పించిన రాజకీయ శక్తులకు, అసాంఘిక శక్తులకు, వారిని రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులకు హెచ్చరి స్తున్నాం మేము స్థలాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వేళతామన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీఓ సంఘం రాష్ట్ర నా యకులు కిరణ్‌గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బైరీ సోమయ్య, వరంగల్ జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్, కార్యదర్శి వేణుగోపాల్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బూరుగురవి, కార్యదర్శి హరికృష్ణ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయ కులు కిరణ్‌గౌడ్, ములుగు జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు జ్ఞానేశ్వర్, కార్యదర్శి పోలు రాజు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు లక్ష్మణరావు, సభ్యులు పుల్లూరు వేణుగో పాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.