నవతెలంగాణ -ఆర్మూర్
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని ప్రజలకు గ్రీన్ ఛాలెంజ్ తెల్పిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జాతీయ అవార్డు గ్రహీత సామజిక సేవకులు పట్వారీ తులసిలు అన్నారు. పట్టణ జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు తులసి కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను అందజేసి ప్రజలకు గ్రేన్ చాలెంజ్ నీ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల్లో కళాశాలలో పాఠశాలలో ప్రజలు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి తమ కర్తవ్యంగా భావించి మొక్కలను నాటాలని సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పట్వారి సేవలు అభినందనీయమని స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -



