
కేంద్ర ప్రభుత్వం ఎందరో మహానుభావులకు మహా నాయకులకు భారతరత్న ఇస్తున్న వేల SC, ST, BC వర్గాలకు రాజ్యాధి కారాన్ని పంచి దేశంలో మొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కలిపించి, తెలుగువారి ఖ్యాతిని ఆత్మ గౌరవాన్ని భారత దేశ నలుమూలలకు చాటి చెప్పిన మహానటులు మహానాయకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలి అని ఆదివారం విలేకరుల సమావేశంలో దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడారు. శ్యాంసుందర్ మాట్లాడుతూ భారతజాతి గర్వించదగిన రాజకీయ నాయకులు,మహోన్నతమైన వ్యక్తి…తెలుగువారి ఆత్మగౌరవంనింపిన..తెలుగు వారి ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు చేసి సంస్కరణలు,చలనచిత్ర రంగం, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను కేంద్రప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆ మహనీయునికి “భారతరత్న” ఇవ్వాలని కోరుతూ భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ,తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహారావు గారికి వరించిన పురస్కారం.. ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం.ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువె ళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా,మెండుగా కనబడుతోంది.ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నా ను.అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తాయని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు.