
– బిల్లులు ఇచ్చేంతవరకు జిపి ట్రాక్టర్ ఇవ్వను
– చిన్నతూండ్ల మాజీ సర్పంచ్ మమత నర్సయ్య ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
2023-24 ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామాభివృద్ధి కోసం రూ.2.31లక్షల పలు రకాల అభివృద్ధి పనులు 6 నెలల క్రితం నిర్వహించి ఎంబి రికార్డులు చేసి బిల్లులు ఇవ్వాలని మండల ఎంపీఓ విక్రమ్ కుమార్ వద్దకు నెలలుగా ప్రదక్షణలు చేస్తే బిల్లులు చేయకపోగా రూ.30 వేల వరకు లంచం ఇస్తేనే బిల్లులు చేస్తానని, తన పదవి పోయేంతవరకు తనను ఎంపిడిఓ కార్యాలయం చుట్టు తిప్పుకున్నాడని మండలంలోని చిన్నతూoడ్ల మాజీ సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య సోమవారం విలేకరులతో ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు తన పెండింగ్ బిల్లులు ఇచ్చేంతవరకు గ్రామపంచాయితికి సంబంధించిన ట్రాక్టర్ తన ఇంటివద్దే ఉంచుకుంటానని తేల్చి చెప్పారు. జిపిలో నిధులు ఉన్నాయని గ్రామంలో ఆరు నెలల క్రితం తాగునీరు, సైడ్రైన్, లైటింగ్,జిపి ట్రాక్టర్ డీజిల్ తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఎంపిఓ కు లంచం ఇవ్వకపోవడంతోనే రికార్డులు చేయక బిల్లులు పెండింగ్ లో పెట్టినట్లుగా, లంచం ఇవ్వకపోవడం తప్పాని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గ్రామ ప్రత్యేక అధికారి టోకెన్ నుంచి బిల్లులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.