– రాజ్భవన్లో కాషాయజెండాను మోస్తున్నారు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. రాజ్భవన్లో కాషాయ జెండాను మోస్తున్నారని విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్భవన్లో కాషాయ జెండాను మోస్తున్న ‘భారతాంబ’ చిత్రంతో కార్యక్రమాన్ని నిర్వహించిన కేరళ గవర్నర్ చర్య చాలా దురదష్టకరమని తెలిపారు. ”గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైౖనది. ఆయన ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఆ పదవిలో కూర్చొని ఇలాంటి వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఆయన భారత మాతను, ఇతరులను వ్యక్తిగతంగా పూజించవచ్చు. కానీ గవర్నర్ కార్యాలయంలో అలా చేయకూడదు” అని బేబీ అన్నారు. అత్యవసర పరిస్థితికి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిర్గతం చేయడం లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఎంఏ బేబీ ప్రకటించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్ఎస్ఎస్ అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేయడానికి కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగబడ్డాయని అన్నారు. ఈ అత్యవసర పరిస్థితిని సీపీఐ(ఎం) బహిరంగంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను జైలులో పెట్టి, పోలీసులు దారుణంగా కొట్టారన్నారు. పోలీసుల దెబ్బల తర్వాత, ఆయన చేతిలో రక్తంతో తడిసిన చొక్కాతో అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారని గుర్తు చేశారు. అప్పట్లో ఇది చాలా చర్చనీయాంశమైందన్నారు. ఆయనతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనకు నాయకత్వం వహించిన ఇతరులను కూడా జైలులో పెట్టారన్నారు. ఆర్ఎస్ఎస్కు చెందిన కొంతమంది సభ్యులను కూడా జైలులో పెట్టారని, కానీ వారు తరువాత బయటకు వచ్చి ఇందిరా పాలనకు మద్దతు ప్రకటించారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఫ్ుచాలక్ దేవ్రాస్ ఇందిరా 20 పాయింట్ల కార్యక్రమానికి మాత్రమే కాకుండా సంజరు గాంధీ ఐదు పాయింట్ల కార్యక్రమానికి కూడా మద్దతు తెలిపారని ఎంఎ బేబీ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ల వ్యవహారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES