నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ యందు బుధవారం ప్రైవేట్ ఎయిర్ బస్ డ్రైవర్ పై ప్రయాణికులు దాడి చేయడం తీవ్ర కలవరం రేపింది. కండక్టర్ను పిలిచేందుకు డ్రైవర్ రెండు సార్లు హారన్ కొట్టడం జరిగింది. దీంతో అక్కడే ఉన్న ఒ ప్రయాణికుడు వచ్చి బూతు మాటలు తిడుతూ డ్రైవర్ పై భౌతిక దాడికి దిగినాడు. దీంతో పలువురు టీఎస్ ఆర్టీసీ సిబ్బందితో కలిసి డిపో ఎదుట నిరసన చేసినారు. డ్రైవర్ ను కొట్టిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.