గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు.

నవతెలంగాణ – ఆర్మూర్ 

మండలం  లోని చేపూర్, కోమన్ పల్లి, ఫత్తేపూర్, గ్రామాలలో గ్రామ అభివృద్ధి పనుల పై  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం పర్యటించి గ్రామస్తులతో చర్చించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తుల వద్ద అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయిస్తానని, ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక అధికారులు గ్రామస్తులతో కలిసి చర్చించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love