యువరైతును కాల్చి చంపిన కేంద్ర ప్రభుత్వం

– ఉత్తర తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పీక కిరణ్,
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు పండించిన పంటలకు,గిట్టుబాటు ధర కల్పిస్తూ, గిట్టుబాటు ధరలకు చట్ట బద్దత కల్పించాలని, స్వామి నాథన్ కమీషన్ సూచనలు అమలు చేయాలని, లకీంపూర్, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పై, పైశాచిక దాడులు చేస్తూ పంజాబ్, హర్యానా పోలీసులు కాల్పులు జరిపి, 24,ఏండ్ల, యువ రైతును, పొట్టన పెట్టుకున్న, బీజేపీ ప్రభుత్వం, ఫాసిస్ట్ విధానాన్ని ఉత్తర తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర  పీక కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతు ప్రభుత్వం అని చెప్పి, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి పది సంవత్సరములు దాటినా ఇచ్చిన హామీలను అమలు అమలు చేయడం లేదని, హర్యానా, పంజాబ్, రాష్ట్రాల రైతులు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి పరిస్థితుల్లో, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, చర్యలు తీసకునేది పోయి, రైతుల పై విచక్షణా రహితంగా దాడులు చేసి, రైతుల ఉద్యమాన్ని, అణచి వేసేందుకు కుట్ర పన్ని, రోడ్డు పై మేకులు దిగ్గొట్టి, హర్యానా పంజాబ్ బార్డర్ లో, రైతుల పై బాష్ప వాయువు ను ప్రయోగించి శత్రువులను తరిమి కొట్టినట్టు, తరిమి కొట్టడం, అమానుషంగా భావిస్తుంది. అదేవిధంగా, నిన్న, హర్యానా పంజాబ్, బార్డర్ లో, హర్యానా పోలీసులు కాల్పులు జరిపి, 24,సంవత్సరాల, యువ రైతు, శుభ కరణ్, ను, పొట్టన పెట్టుకున్న ఘనత బిజెపి మతతత్వ, ఫాసిస్ట్ దాడులకు నిదర్శనం. రైతులు ఆరు నెలలకు సరిపోయే తిండి సామాగ్రిని తెచ్చుకున్న రైతులను నకిలీ రైతులు గా, గుండాలు గా, పరిగణించడం బిజెపి ప్రభుత్వ, మతోన్మాద పాలనకు అద్దం పడుతుంది, అంటే, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే, ధనిక రైతులు అవుతారని, ఎల్లప్పుడు, రైతులు పేదవారు గానే బతకాలని, ఆరెస్సెస్ , భావిస్తుంది, కాబట్టి దాని అడుగు జాడలో పయనిస్తున్న, బిజెపి ప్రభుత్వం, ఆరెస్సెస్ అండతో రైతుల పై, విచక్షణా రహితంగా దాడులు చేసి ఆరెస్సెస్, మెప్పు పొందడానికి, మాత్రమే పని చేస్తుంది. తప్ప, ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాదని తేలి పోయింది. ఇప్పటికైనా, రైతులు చేస్తున్న ఉద్యమం న్యాయమైనదని భావిస్తూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, కల్పించేందుకు, స్వామి నాథన్ కమీషన్ సూచనలు అమలు చేయాలని, వాటికి చట్ట బద్దత కల్పించాలని, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి, నష్ట పరిహారం, చెల్లించి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉత్తర తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మాల మహానాడు నాయకులు బోడ బాపు వావిళ్ళ రమేషు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు
Spread the love