
మంథనిలోని బోయిన్ పేటలో ఉన్న నాగులమ్మ ఆలయానికి కీ,శే,చంద్రుపట్ల సీతారాం రెడ్డి పేరు మీద వారి మనుమడు శ్రీమతి శ్రీకరిష్మా అమిత్ బుధవారం కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్షించుకొని రూ.20వేల విరాళం అందజేసినట్లుగా పెద్దపల్లి జిల్లా మత్స్యకారుల సహకార డైరెక్టర్ పోతరనేని క్రాంతి తెలిపారు. విరాళం అందుకున్న నాగులమ్మ ఆలయ కమిటీ సభ్యులు కరిష్మా అమిత్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.