ఆర్థిక ఇబ్బందులతో, మాజీ వార్డ్ మెంబర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన చింతకుంట కవిత (36), గత 18 సంవత్సరాల క్రితం చింతకుంట కిషన్ తో వివాహమైంది. ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో, అనారోగ్యంతో అప్పు కావడంతో, డ్వాక్రా గ్రూప్ రుణాల లో రూ 2 లక్షల 50 వేలు అప్పు తీసుకొని, ఆర్థిక ఇబ్బందులతో గత 7 నెలల నుండి అప్పు చెల్లించకపోవడంతో, గురువారం ఉదయం అప్పు చెల్లించాలని, బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు ఇంటికి వెళ్లి అప్పు కట్టాలని చెప్పి వెళ్లిపోగా, భర్త కిషన్ ఇంటి నుంచి డబ్బుల కోసం బయటకు వెళ్లగా, మనస్థాపానికి గురై ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకోగా, కుమారుడు గమనించి తీసివేసి, తండ్రికి సమాచారం అందించడంతో, చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారని భర్త కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శవానికి పోస్టుమార్టం నిర్వహించారు.