సాధికారతతోనే సమాజంలో మహిళలు రాణింపు: ఏఎస్ఐ వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – అశ్వారావుపేట
బాలికలు,యువతులు,మహిళలు సాధికారత సాధించినప్పుడు ఏ  సమాజంలో రాణిస్తారని,  భవిష్యత్తులో కోరుకున్న రంగాలలో స్థిర పడతారని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.  గురువారం నారం వారి గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర రావు అద్యక్షతన జరిగిన బాలికా సాధికార క్లబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బాలికలు తమకు ఎదురయ్యే సమస్యలను సమర్ధవంతంగా  ఎదుర్కోవాలని,అందుకు పోలీస్ శాఖ అనేక రక్షణ చర్యలను చేపట్టినట్లు ఆయన వివరించారు.అనంతరం ఐసీడీఎస్ సూపర్ వైజర్ వరలక్ష్మి మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని,బాలికలు తమ సమస్యలను 1098 కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.తదుపరి ప్రభుత్వ వైద్యురాలు భవ్య సుధ మాట్లాడుతూ బాలికలు ఋతు క్రమ సమస్యలను ప్రత్యేకించి చూడకుండా, జీవితంలో అదొక భాగంగా గుర్తించాలని,వ్యక్తిగత పరి శుభ్రత ద్వారా పోటి ని అధిగమించాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు   చంద్రశేఖర్ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం లో మండలంలో ఎంపికైన ఏకైక పాఠశాల  నారం వారిగూడెం కావడం అభినందనీయం అని అన్నారు. రిసోర్స్ పర్సన్స్ విచ్చేసిన ఉపాధ్యాయులు మడకం వెంకటేశ్వర్లు,నల్లపు కొండలరావు,బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.వెంకయ్య లు బాలికలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జీసీఈసీ అదనపు మెంబర్,మహిళా కానిస్టేబుల్ హిమబిందు, మెంబర్ కన్వీనర్ బుల్లెమ్మ పలు అంశాలపై సూచనలు చేశారు. సీనియర్ టీచర్స్ బి.శ్రీనివాసరెడ్డి,ఎల్.రేణుక, హరినాథ్,జి.సుజాత,బి.రమేష్ లు పాల్గొన్నారు.
Spread the love