నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో భవిత దివ్యాంగుల పిల్లల సమక్షంలో మాజీ సర్పంచ్ వికార్పాషా ఆధ్వర్యంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. దివ్యాంగుల చిన్నారులకు కేక్ కట్ చేసి వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్కే అహ్మద్, కే సాయిలు, హైమద్, పటాన్, రఫీ ఖాన్, భూమేష్, జాడి సాయిలు, డైరెక్టర్ సాయిలు, నరేష్, ఇమ్రాన్, మధు, రాజు, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.