
సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సమాచార హక్కు చట్టం ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదల ప్రసాద్ అన్నారు. ఆదివారం బీబీ గూడెం గ్రామంలో సమాచార హక్కు చట్టం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు సమాచార హక్కు చట్టం ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా జరిగేటువంటి ప్రతి రూపాయ గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. అవినీతి నిర్మూలనకు ఉపయోగపడుతుందన్నారు. బాల కార్మికుల నిర్మూలన కోసం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది భారతదేశంలో చాలా రాష్ట్రాల బాల నిర్మూలల కోసం పని చేసినటువంటి ఎంవీఎఫ్ జాతీయ చైర్మన్ రేగటి వెంకట్ రెడ్డి కి విద్య కమిషన్ చైర్మన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ యూత్ ఫోర్స్ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు శేఖర్, జిల్లా నాయకులు మామిడి సతీష్, పడిదల భరత్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.