కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మండలంలో కల్యాణ లక్ష్మి పథకానికి గతంలో దరఖాస్తు చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాతూరు గ్రామంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love