వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జమ్ జమ్ చలివేంద్రం

– చల్లటి తాగునీరు,మజ్జిగ అందిస్తున్న ఎం.ఎస్.కె బాబు, ఫ్యామిలీ
– సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
ఎండల్లో తిరిగి బేజారువుతున్నా ప్రజలకు, దవాఖానకు వచ్చే రోగుల దాహార్తిని తీరుస్తున్న జమ్ జమ్ చలివేంద్రం. నాగార్జునసాగర్ హిల్ కాలనిలోని కమలా నెహ్రూ దవాఖాన వద్ద హిల్ కాలానికి చెందిన ఒక ముస్లిం కుటుంబ సభ్యులు కులమతాలకు అతీతంగా ఎం.ఎస్.కె బాబు, ఫ్యామిలీ ఆధ్వర్యంలో జమ్ జమ్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తు ఉపశమనం కల్గిస్తూన్నారు. అదేవిదంగా రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతిరోజు మజ్జిగను అందిస్తున్నారు నిర్వాహకులు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ…గత 10సంవత్సరాలుగా నిత్యం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని,నందికొండ ప్రజలకే కాకుండా దవాఖానకు వచ్చే రోగులకు మజ్జిగ,మంచి నీటిని అందిస్తున్నామని అన్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చల్లటి నీటి వలన శరీరంలోని ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉండేలా, వడ దెబ్బ నుంచి రక్షణ పొందేలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల స్థానికుల నుండి అభినందనలు వెలువెత్తుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.కె బాబు, ఫ్యామిలీ సభ్యులు జబ్బర్,రియాజుద్దీన్,సైదా సాహెబ్,రెహమాన్ షరీఫ్,స్థానికులు తదితరులున్నారు.

Spread the love