న్యూఢిల్లీ: ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ టయోట కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఈ ఏడాదిలో రెండో సారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను హెచ్చిస్తున్నట్లు గురువారం తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతక్రితం జనవరిలోనూ ధరలను పెంచింది.