
తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు నార్ల పాటి శ్రీను అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి కట్రం స్వామి దొర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వ్యవస్థాపక అద్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉండి తెలుగు జాతి ఉద్ధరణ కు ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి,విజయం సాధించి అనేక ఆధునిక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పెద్ద పీఠం వేసి రాజకీయంగా ఎదగటానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారే అన్నారు.కూడు,గూడు,గుడ్డ అనే నినాదంతో పక్కా భవనాలు,రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన గొప్ప మహానుభావుడు అని కొనియాడారు.అలాగే పాలనా పరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి నేటికి 42 వసంతాలు పూర్తి చేసుకున్న చెక్కు చెదరని తేజస్సుతో పార్టీ నిలబడటానికి ఆ మహానుభావుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని అన్నారు.ఆ తర్వాత ఎన్నో ఆటు పోట్లు మధ్య నారా చంద్రబాబునాయుడు పార్టీ పగ్గాలు చేతబట్టి అభివృద్ధికి పెద్ద పీఠం వేసి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీని నిలిచిపోయేలా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అంకోలు వెంకటేశ్వరరావు, పేరాయిగూడెం గ్రామ శాఖ నర్రా రాకేష్ ,ఉప్పల బ్రహ్మేంద్ర రావు,పోతురాజు నాని,సత్తిబాబు,గోపి, బుల్లి బాబు,అంజిబాబు, ఉదయ్, సురేష్ , తదితరులు పాల్గొన్నారు.