
నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు తుక్కుగూడలో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జన జాతర భారీ బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటి పరిశ్రమల శాఖ మంత్రి తోపాటు మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మెన్ ఫెస్టోను విడుదల చేస్తారని వివరించారు.మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జన జాతర సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.