విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు బుధవారం నూతన కార్యవర్గంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా శృంగారం వెంకట కిషన్, పుస్కూరు ముఖేష్ లను ఎన్నుకోవడం జరిగింది. వీరికి బాధ్యతలను గత సంఘ బాధ్యులు శృంగారం శ్రీనివాస్, పుస్కూరు గంగ శేఖర్ లు అప్పగించారు. సంఘానికి సలహాదారులుగా చొక్కల రాజేశ్వర్, పుస్కురు గంగామోహన్, శృంగారం శ్రీకాంత్, శృంగారం వెంకటేశ్వర్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గమును సన్మానించడం జరిగింది.
Spread the love