– బార్సిలోనా ఓపెన్‌తో రీ ఎంట్రీ
పారిస్ : స్పెయిన్ బుల్, 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ రఫెల్ నాదల్ పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. హిప్ గాయంతో బాధపడుతున్న నాదల్.. ఇటీవల ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ మినహా ఎక్కడా రాకెట్ పట్టలేదు. ఏటీపీ కాంపిటీషన్ బార్సిలోనా ఓపెన్‌తో రఫెల్ నాదల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది జనవరి తర్వాత నాదల్ ఆడనున్న తొలి టోర్నీ ఇదే కానుంది. జూన్‌లో 38వ వసంతంలోకి అడుగుపెట్టనున్న నాదల్.. గాయం నుంచి కోలుకుంటూ ఫ్రెంచ్ ఓపెన్‌లో చారిత్రక 15వ టైటిల్ సొంతం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు. వచ్చే వారం ఆరంభం కానున్న బార్సిలోనా ఓపెన్‌లో నాదల్‌తో వరల్డ్ నం.63 కొబాలి పోటీపడనున్నాడు. కార్లోస్ అల్కరాజ్, డానిల్ మెద్వదేవ్ సైతం పోటీపడుతుండగా బార్సిలోనా ఓపెన్‌పై మరింత ఆకర్షణ వచ్చింది. గాయంతో 2023 సీజన్ మొత్తానికి దూరమైన నాదల్ కేవలం బ్రిస్బేన్ ఓపెన్‌లో మాత్రమే పోటీపడ్డాడు.